దీక్ష అంటే ప్రభుత్వమైనా దిగిరావాలి.. ఇటు మరణం దరికైనా వెళ్లాలి

YS-Barathi-Meets-Jagan-in-Gandhi-Hospital

YS-Barathi-Meets-Jagan-in-Gandhi-Hospital

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అర్జంటుగా జగన్‌ దీక్షనుంచి అదనపు మైలేజీ రాబట్టు కోవడం ఎలాగా? అనే మీమాంసలో కొట్టుకుంటోంది. ఆస్పత్రికి తరలించిన తర్వాత కూడా వైఎస్‌ జగన్‌ దీక్ష చేస్తున్నారు. బీపీ షుగర్‌ లెవల్స్‌ పడిపోయిన మాట కూడా వాస్తవం. అయితే ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారితే మాత్రం బలవంతంగానైనా తాము వైద్యం అందించి తీరుతాం అని.. డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. నిజానికి ఇక ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

అయితే అక్కడ ఏదో ఘోరమైన ఆందోళన పొడసూపి ఉన్నట్లుగా బిల్డప్‌ లేకపోతే గనుక.. తమ పార్టీకి మైలేజీ రావడం అనేది కల్ల. పైగా.. ఎటూ జగన్‌ దీక్ష పేరిట వీలైనంత గరిష్టమైలేజీ సాధించుకోవడం వారి లక్ష్యం. అందుకే ఎమోషనల్‌ హైడ్రామాకు తెర తీశారు.

జగన్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. తమను ఆయన వద్ద ఉండేందుకు అనుమతించాలంటూ.. తల్లి విజయమ్మ, భార్య భారతి సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందులో ఎమోషనల్‌ ట్యాగ్‌ తప్ప.. నిపుణులైన డాక్టర్లంతా నిరంతరం జగన్‌ను కనిపెట్టుకుని ఉండగా.. ప్రత్యేకంగా వీరుండి సాధించేదేమీ ఉండదన్నది నిజం. అదే సమయంలో.. వీరికి జగన్‌ ఆరోగ్యం గురించి నిజంగానే అంత చింత ఉంటే గనుక.. ఆయనను విరమించుకోవాల్సిందిగా.. విజ్ఞప్తి చేస్తే సరిపోతుంది. అక్కడితో వారు కోరుకునే ఆరోగ్యం తిరిగి దక్కుతుంది. ఒకసారి ఆమరణ నిరాహార దీక్ష అన్న తరువాత.. చచ్చేవరకు చేసే దీక్ష అనే పేరు. ఇటీవలి కాలాల్లో అర్థాలు మారిపోయాయి గానీ… దీక్ష అంటే అటు ప్రభుత్వమైనా దిగిరావాలి.. ఇటు మరణం దరికైనా వెళ్లాలి. అంతకు సిద్ధపడిన తర్వాత.. ఇప్పుడిక ఆరోగ్యం అంటూ గగ్గోలు పెట్టడం ఎందుకు? ఇదంతా మైలేజీ కోసం సృష్టిస్తున్న హడావిడి తప్ప.. ఆరోగ్యం మీదే ధ్యాస ఉంటే విరమించుకోవచ్చు కదా! ఏంటో ఈ నాటకం అర్థం కాదు.

విజయమ్మ, భారతి ఇద్దరూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేస్తే.. రేపు విచారిస్తాం అని కోర్టు సెలవిచ్చింది. జగన్‌ వద్దకు వెళ్లడానికి అనుమతి కోసమే ఈ పిటిషన్‌ వేశారు. మరి భారతి మళ్లీ గాంధీ ఆస్పత్రికి ఎందుకు వెళ్లినట్లు? చూడబోతే.. అధికారులు తన భర్తను కనీసం కలవనివ్వకుండా వేధిస్తున్నారనే బిల్డప్‌ను ప్రజల దృష్టిలో కలిగించడానికి .. మొత్తానికి మైలేజీ విషయంలో వైకాపా ప్లాన్‌ చాలా పొందికగానే ఉన్నట్లుంది.

Comments are closed.