ఛీ.. ఛీ.. ఇదేం బతుకు అంటూ ఏడ్చినంత పనిచేసిన చిరంజీవి!

ఛీ.. ఛీ.. ఇదేం బతుకు అంటూ ఏడ్చినంత పనిచేసిన చిరంజీవి!

ఛీ.. ఛీ.. ఇదేం బతుకు అంటూ ఏడ్చినంత పనిచేసిన చిరంజీవి!

ఛీ..ఛీ.. ఇదేం బతుకు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారట. సీమాంధ్రుల సమస్యలు, అభ్యంతరాలు తెలుపుకునేందుకు ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ముందు చిరంజీవి దాదాపు ఏడ్చినంత పనిచేశాడు. ఈ ఆవేదన ఎందుకో కాదు.. ఆంధ్రావారు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవించాల్సి వస్తోందని బాధపడ్డారట. 

మరి చిరంజీవి ఆవేదన సరైనదేనంటూ ఆంటోని అంటూనే.. తప్పదు. నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు కూడా తీసుకోకుంటే అది చారిత్రక తప్పిదం అవుతుందని ఆంటోనీ కూడా అన్నారట. ఐతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దని, దానివల్ల సీమాంధ్రులు నష్టపోతారని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అడగలేదని సమాచారం. 

ఒకప్పుడు ఆంధ్ర, మద్రాస్‌లో కలిసి ఉన్నప్పడు అక్కడ ఆంధ్రావారు ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవించాల్సి వచ్చింది. అప్పటికే అక్కడ ఆంధ్రావారు ఇప్పుడు హైదరాబాద్‌లో స్థిరపడ్డట్టుగా స్థిరపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక పర్మినెంట్ ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వచ్చింది అన్నారట.

ఇదేవిధంగా 60 సంవత్సరాలుగా హైదరాబాద్ మాది అనుకుని ఇక్కడికి ఎందరో ఆంధ్రావారు స్థిరనివాసం ఏర్పరుచుకున్న నేపథ్యంలో మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఇచ్చేస్తే ఆంధ్రావారికి మళ్లీ ద్వితీయ శ్రేణిగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చిరంజీవి ఆవేదన వెళ్లగక్కారని సమాచారం. 

అన్యాయం జరగకుండా చూడండి సార్ అని ఆంటోనీతో చిరంజీవి మొరపెట్టుకోవడం ఈ కమిటీ ముందు హాజరైన అందరిని కలచివేసిందట. సినీ నటుడిగా, మెగాస్టార్ ఉన్నప్పుడే తన జీవితం హాయిగా ఉన్నదని, రాజకీయాల్లో కాలుపెట్టి ఛీ… ఛీ… ఇదేం బతుకు బాబోయ్ అని కూడా చిరంజీవి బాధపడినట్లు కమిటీకి హాజరైన నేతలు చెబుతున్నారు. ఇంత సెన్సిటివ్ మనిషి రాజకీయాల్లో ఎలాగో మేనేజ్ అవుతున్నాడు పాపం అంటూ బాధపడుతున్నారట.

Comments are closed.