బొత్స సత్యనారాయణ : ఆంటోనీ కమిటీ నామమాత్రమే!

బొత్స సత్యనారాయణ  ఆంటోనీ కమిటీ నామమాత్రమే!

బొత్స సత్యనారాయణ ఆంటోనీ కమిటీ నామమాత్రమే!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఏకే ఆంటోనీ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శుక్రవారం తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభమైందని, అయితే, ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని ఆయన నేతలను కోరారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు.

మరోవైపు.. రాష్ట్ర విభజనతో అంటోనీ కమిటీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. ఇది కేవలం పార్టీ పరమైన కమిటీ మాత్రమేనని, పార్టీలో అభ్యంతరాల కోసమే కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. విభజనపై ఇరు ప్రాంతాల నుంచి అభిప్రాయం సేకరిస్తుందని వివరించారు. విభజనపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే తన పని ప్రారంభించిందన్నారు.

Comments are closed.