సీమాంధ్రులను గుజరాతీలు, పంజాబీలతో పోల్చుతారా…? చిరంజీవి ఫైర్

సీమాంధ్రులను గుజరాతీలు, పంజాబీలతో పోల్చుతారా... చిరంజీవి ఫైర్

సీమాంధ్రులను గుజరాతీలు, పంజాబీలతో పోల్చుతారా… చిరంజీవి ఫైర్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నివాసముంటున్న సీమాంధ్రులను గుజరాతీ, పంజాబీ, ఒరిస్సా వారితో పోల్చడంపై చిరంజీవి ఫైర్ అయ్యారు. తెలుగువారంతా కలిసి ఉన్న హైదరాబాదులో అప్పుడే సీమాంధ్రులను గుజరాత్, పంజాబ్ వారితో పోల్చడం తగదన్నారు. 

తెలంగాణ ప్రాంత నాయకులు, తెరాస పార్టీకి చెందిన కొందరు నాయకులు… హైదరాబాదులో గుజరాతీ, మరాఠీ, పంజాబీలు ఉండటంలేదా… వారు ఎలాంటి భయం లేకుండా ఉంటున్నప్పుడు సీమాంధ్రులకు వచ్చిన భయం ఏంటి అని ఇటీవలి ప్రశ్నించిన సందర్భాలున్నాయి. దీనిపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తెలుగువారంతా ఒకటే అనీ, తెలంగాణలో ఉన్నా, సీమాంధ్రలో ఉన్న తెలంగాణవారయినా… ఇలా ఎవరు ఎక్కడ ఉన్నా అంతా తెలుగువారేనంటూ చెప్పారు. అంతేతప్ప హైదరాబాదులో ఉన్న తెలుగువారిని ద్వితీయశ్రేణి పౌరులుగా చూడకూడదని అన్నారు.

Comments are closed.