జగన్ ప్లాన్ రివర్స్ అయిందా… తెలంగాణలో వైఎస్సార్సీపి జాడేదీ…?!!

Jagan Mohan Reddy quits as MP over Telangana, Jagan plan, Samaikyandhra, MLAs

Jagan Mohan Reddy quits as MP over Telangana, Jagan plan, Samaikyandhra, MLAs

తొందరపడి ఓ కోయిలా…? ముందే కూసిందీ… అన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి తయారయ్యిందంటున్నారు రాజకీయ పండితులు. అసలింతకీ సంగతి ఏంటయా అంటే, రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు, అటువైపు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా రాజీనామాలు చేసి పారేశారు. దీనిపై కొండా సురేఖతోపాటు ఆ ప్రాంతంలోని నాయకులంతా మూకుమ్మడిగా పార్టీతో తెగతెంపులు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఐతే ఎమ్మెల్యేల రాజీనామాల ప్లాన్ తో అటు కాంగ్రెస్ ఇటు తెదేపాలను ఫిక్సులో పడేయాలని జగన్ అనుకున్నారట. కానీ ప్లాన్ రివర్సయింది. కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీలు రెండూ కూడా రెండు ప్రాంతాల్లో ఏదోవిధంగా తమతమ ప్రణాళికలతో ముందుకు వెళుతుండగా జగన్ మాత్రం తనంతట తానే తెలంగాణలో పార్టీని దెబ్బ తీసుకున్నారని అంటున్నారు. 

పెద్ద పార్టీలకు లేని తొందర జగన్ మోహన్ రెడ్డికి ఏమొచ్చిందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నారు. పైపెచ్చు నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేవలం తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు కార్యాలయంలో తప్ప మరెక్కడా జగన్ పార్టీ జెండాలు రెపరెపలు కనబడలేదని అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే తెలంగాణలో వైఎస్సార్సీపి చాప చుట్టేసినట్లేనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నారు. మరి సీమాంధ్రలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Comments are closed.