బాబు ఢిల్లీ టూరు-వైఎస్సార్సీపీ కంగారు

YSRCP-in-Tension-for-Chandrababu-Delhi-Tour

YSRCP-in-Tension-for-Chandrababu-Delhi-Tour

ఎట్టకేలకు ఢిల్లీకి బాబు వెళుతున్నారు, ఇది వైఎస్సార్ సిపి లో ఎక్కడ లేని కంగారు పుట్టిస్తోంది. చంద్రబాబు ఎప్పుడు డిల్లీకి వెళ్లినా వైఎస్సార్ పీసీ కి కాస్త గట్టిదెబ్బే తగుల్తోంది. అందుకే ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో అని ఆ పార్టీ జనాల కాస్త గాభరా పడుతున్నారు. అయితే ఈసారి స్పెషాలిటీ ఏమిటంటే, కొట్టకుండానే ఆదికి ముందే ఏడుపు లంకించుకున్నట్లు, బాబు కొడతాడు బాబోయ్..అని గోల ప్రారంభించడం. నిజానికి ఇది కొత్త స్ట్రాటజీ కాదు. వై ఎస్ రాజశేఖర రెడ్ట్డి ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలపై ఇదే స్ట్రాటజీ వాడారు. ఆ రెండూ తమకు వ్యతిరేకం అన్నది జనాల్లో వీలయినంత ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. తద్వారా, జనం ఒక వేళ అవి నిజమే చెప్పినా నమ్మకుండా వుండేందుకు. ఇప్పడు బాబు అండ్ కో ఢిల్లీ టూర్ పై కూడా వైకాపా ఇలాంటి ఎత్తుగడే అమలు చేస్తోంది.  రేపు తేడా ఏదన్నా జరిగితే దాన్ని బాబు ఖాతాలో వేసేందుకు ఇప్పటి నుంచే రిహార్సల్ అన్నమాట.

మరోపక్క జగన్ జైలునుంచి బయటకు వస్తాడు అనుకున్న ప్రతిసారి చంద్రబాబో, ఆ పార్టీ కీలక నేతలో ఢిల్లీలో మంత్రాంగం నడుపుతున్నట్లు, జగన్ కు బెయిల్ ఆగిపోయినట్లు ప్రచారం సాగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా సేమ్ సిచువేషన్.జగన్ బెయిల్ పై విచారణ పూర్తయింది, తీర్పు ను కోర్టు ఈ నెల 23న వెలువరించనుంది, ఖచ్చితంగా అంతకు ముందే చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. అందుకే జగన్ తో పాటు వైఎస్సార్ సిపి లోను ధడ మొదలయింది. పైగా చంద్రబాబు  డిల్లీ వెళుతున్నది కూడా రెండే రెండు అంశాలపై ప్రధానిని, రాష్ట్రపతిని కలవడానికి. ఈ విషయాన్ని దాచడానకి చంద్రబాబు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ప్రయత్నించలేదు. బాహాటంగానే చెపుతున్నాయి.

బాబు పెట్టున్న రెండు పనులలో మొదటిది రాష్ట్ర విభజన అంశం కాగా రెండవది జగన్ కేసుల విషయంపై ఫిర్యాదు చేయడానికే. జగన్ కేసుల విషయం తేల్చుకోవడానికే వెళుతున్నాని చెప్పాక కూడా బాబు ఢిల్లీ టూరుపై వైకాపా నాయకుల్లో బెంగ ఉండదా? అందుకే చంద్రబాబు ఏం చేస్తాడో అన్న భయం జగన టీంలో దడ పుట్టిస్తోంది. అయితే ఈ సారి చంద్రబాబుకు జగన్ విషయంలో గెలిచే అవకాశాలు మాత్రం అంతగా లేవంటున్నారు న్యాయనిపుణులు. కారణం సిబిఐ జగన్ కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని అధికారికంగా కోర్టుకు విన్నవించడమే. అయినా సరే వైఎస్సార్ సిపిలో మాత్రం దడ మాత్రం పట్టుకుందట.

Comments are closed.