Telangana state likely to be announced today

Telangana state likely to be announced today

Telangana state likely to be announced today

నేడే ఎన్నో రోజులుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయం రేపటితో ఓ కొలిక్కి రానుంది, నేడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేయనున్నారని సమాచారం. దేశ వ్యాప్తంగా బాగా ప్రాచుత్యం ఉన్న ఓ ప్రముఖ టీవీ చానల్ చెప్పిన సమాచారం ప్రకారం నేడే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించనున్నారు. ‘ దిగ్విజయ్ సింగ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు బోర్డ్ లోని అందరు లీడర్లు తెలిపారని, నేడే ఈ విషయానికి సంబందించిన అనౌన్స్ మెంట్ ఉంటుందని’ ఆ చానల్ తెలిపింది.

ఈ తాజా సమాచారాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రాన్ని విడగొట్టడానికే కేంద్రం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్రలో ధర్నాలు, నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.