జగన్ లేఖ సంగతేంటి?

jagan-stand-on-telangana

jagan-stand-on-telangana

మాట మార్చటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాతే. మాట మీద నిలబడతామని.. మడం తిప్పని వంశం అంటారే కానీ.. అలాంటివేమీ చేయని వంశం వైఎస్సే కుటుంబానిదే. చెప్పే మాటకు.. చేసే పనికి ఏమాత్రం పొంతని ఉండకపోవటం వారి ప్రత్యేకత. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీతోనే ఫైటింగ్ పెట్టుకున్నాడు మా అధినేత అంటూ జగన్ ను హీరోలా చూపే ప్రయత్నం చేస్తారు ఆ పార్టీ నేతలు. కానీ.. అధికారం కోసం ఆరాటం తప్పించి కాంగ్రెస్ పార్టీతో మరే పంచాయితీ లేదన్నది బహిరంగ రహస్యం. ఇప్పడు రాష్ట్ర విబజనకు సంబంధించి కూడా.. ఆ పార్టీ పోయినన్ని హోయలు.. చూపించిన చిన్నెలు అన్నీ ఇన్నీ కావు.

ఓ సందర్భంలో ఆ పార్టీ అధినేత జగన్ వల్లె వేసిన చిలకపలుకులను చూస్తే.. ‘‘అక్క కొండా సురేఖ నా కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ త్యాగాలను చూసే తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తున్నా. కేంద్రం తెలంగాణ ఇస్తే.. కాదనం’’ ఇడుపులపాయలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని లేఖ రాయటం కూడా వాస్తవమే. అయినా.. తామేమీ పాపం ఎరుగనట్లు ఇప్పుడు ఆ పార్టీ నేతలు మాట్లాడటం చూస్తే.. వారి అసలు రంగు తెలిసిపోతుంది. చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా మాట్లాడుతూ తెలంగాణకు తాము అనుకూలం అన్న వాళ్లే ఇప్పుడు భిన్నంగా ప్లేటు తిప్పేశారు. తాత్కలిక రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజాసంక్షేమం ఏమాత్రం పట్టని వైఎస్సార్ కాంగ్రెస్ అసలు రూపు ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయిందనే చెప్పాలి.

 

 

Comments are closed.