హైదరాబాద్ పైనే అన్ని ప్రాంతాల భయాందోళనలు

committee-on-hyderabad

committee-on-hyderabad

హైదరాబాద్ విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించాలనుకుంటోందా? హైదరాబాద్ పైనే అన్ని ప్రాంతాల భయాందోళనలు వ్యక్తం అవుతుండడం, అసలు హైదరాబాద్ ను కేంద్రం ఆధీనంలో వుంచి, రెండు రాష్ట్రాల రాజధానులను అక్కడే నిర్వహించడం ఏ మేరకు సాధ్యం, ఏ మేరకు రాజ్యాంగ సమ్మతం అన్న విషయాలన్నింటినీ కూలంకషంగా చర్చించి,తగిన సూచనలు చేసేందుకు వీలుగా ఇటు రాజకీయ అఖిలపక్షాలు, అటు న్యాయ శాఖ నిపుణులతో ఓ కమిటీ వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కాంగ్రెస్ పలు ప్రయోజనాలు ఆశిస్తోంది.

హైదరాబాద్ పై ఏ నిర్ణయం తీసుకున్నా,  ఆ నిర్ణయాన్ని అన్ని పార్టీలకు ముడిపెట్టడం, రాజ్యాంగ సమస్యలు రాకుండా చూసుకోవడం, అన్నింటికి మించి, ఇలాంటి కమిటీ వేసామని, హైదరాబాద్ పై ఆందోళన వద్దని సీమాంధ్ర ఉద్యమ కారులకు,. ముఖ్యంగా ఎన్జీవోలకు నచ్చచెప్పడం వంటి బహుళ ప్రయోజనాలు దీని వెనుక వున్నాయి. ఉద్యమం తాత్కాలికంగా సద్దు మణిగితే, కమిటీ పేరు చెప్పి సాగదీసుకుని, పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని తెలుస్తోంది.

Comments are closed.