బాబు ఝలకిస్తున్నాడు

Chandrababu-Strategy-behind-delhi-Tour

Chandrababu-Strategy-behind-delhi-Tour

చంద్రబాబును తలచుకుని ఆయన రాజకీయ ప్రత్యర్థులు జంకుతున్నారు. ఇలా జంకేవారిలో ఇటు వైకాపా జనాలు, అటు తెలంగాణా నాయకులు కూడా వుండడం విశేషం. కారణం ఒక్కటే. తగిన ప్రణాళిక లేకుండా ఆయన ఏమిలేనిదే ఏది చేయడు. ఉన్నట్లుండి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తాడు కానీ, దాని వెనుక డెప్త్ చాలా వుంటుది. ఇప్పుడాయన అత్యంత కీలకమైన తరుణంలో ఇరు ప్రాంతాల నేతలను వెంటతీసుకుని ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో వున్నారు. పైగా తన టూర్ పోగ్రామ్ ఏదీ పెద్దగా దాచలేదు కూడా. ఈ ప్రయాణంలో   జగన్ కేసుకు సంబంధించిన వ్యవహారాలపై కూడా  ఆయన దృష్టి సారిస్తారని తెలుగుదేశం నాయకులు చెప్పనే చెప్పారు. అందుకే వైకాపా నాయకులు ఉలిక్కిపడుతున్నారు. ఇలా ముందుగా చెప్పి మరీ బాబు ఢిల్లీ వెళ్తున్నారంటే, అందులో ఏదో మర్మం ఉండి ఉంటుంది. అదేంటనేది తెలియక ఆయన ప్రత్యర్థిపార్టీలు జుట్టు పీక్కుంటున్నాయి. అసలే జగన్ బయటకు వస్తాడని ఎదురుచూస్తుంటుంటే, బాబు మోకాలు అడ్డుతాడని భయపడుతున్నారు. బాబు కనుక ఢిల్లీ వెళ్లి కేసు లొసుగులు ఏకరవు పెడితే, సిబిఐ తన ఉచ్చును మరింతగా బిగిస్తుందని వారి భయం.

ఇక తెలంగాణా నెతల భయం వేరేగా వుంది. ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పి, వివిధ రాజకీయ పార్టీల మనసును తెలంగాణాకు వ్యతిరేకంగా ఎక్కడ మార్చేస్తాడో అని వారు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎన్నికల కాలం. థర్డ్ ఫ్రంట్ కు కావచ్చు, ఎన్డీఎ కు కావచ్చు, చంద్రబాబు అవసరం బోలెడంత వుంది. అందువల్ల బాబు మాటకు వారు తలొగ్గక తప్పదు. అందువల్ల బాబు వారిని ఫ్రభావితం చేస్తాడన్నది తెలంగాణా ఉద్యమ నాయకుల ఆలోచన. ఇలా పిలువని పేరంటంటా ఇరు ప్రాంతాల నేతలను తన వెంట తీసుకుని  చంద్రబాబు ఢిల్లీ వెలుతున్నాడంటే అందులో ఏదో పెద్ద మతలబే దాగి ఉంటుంది అన్నది మాత్రం నిజం. మరి అదేంటి… అది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికా, లేక విభజన చేసినా మంచిదే కాని ఇరుప్రాంతాలకు న్యాయం జరిగేలా ఉంచడానికా, రెండు కాక ఇంకేమైనా ఇతరత్రా వ్యూహమేదైనా ఉందా.. అంటూ రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకటి మాత్రం నిజం. రాష్ట్రం సమైక్యంగా వుంటేనే బాబుకు, ఆయన పార్టీకి మంచిదన్నది వాస్తవం. రెండు చోట్లా కాంగ్రెస్ వ్వవహారాలను జనం ముందు విప్పిచెప్పడం ద్వారా, వీలయినన్ని సీట్లు గెలుచుకునే అవకాశం వుంది.పైగా రాష్ట్రం సమైక్యంగా వుంటే, రెండు చోట్లా ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లే అవకాశం వున్న ఏకైక పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోతెలుగుదేశం మాత్రమే.

Comments are closed.