ఇంత నీచమైన పాలన నేనెన్నడూ చూడలేదు

chandrababu naidu fire on upa govt andpolitics

chandrababu naidu fire on upa govt andpolitics

హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యూపీఏ సర్కారు దేశాన్ని భ్రష్టు పట్టించిందని చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆర్థిక వృద్ధిరేటు తగ్గడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు.
s
విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆర్థికసంక్షోభంపై ప్రభుత్వానికి అధ్యయనం కరవైందన్నారు. బొగ్గు శాఖలో దస్ర్తాల గల్లంతుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు.

1991 లో ఉన్న దేశ పరిస్థితులు మళ్లీ ఇప్పటికే వచ్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్డీఐలలో పెట్టుబడులు అనుమతించినా, ఇంతవరకు ఏమి రాలేదని ఆయన అన్నారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంత ఘోరంగా పడిపోయిందని, దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి బాగా దెబ్బ తింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి కారణంగా దేశం తీవ్రంగా నష్టపోతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

Comments are closed.