ఈ ఫీల్డ్‌లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నేనేరా…

tollywood-stylish-hero-bhai-movie-first-look

tollywood-stylish-hero-bhai-movie-first-look

కింగ్ నాగార్జున భాయ్ అవతారంలో అద‌ర‌గొడుతున్నాడు. “హైద‌రాబాద్‌లో రెండు ఫేమ‌సు. ఒక‌టి ఇరానీ ఛాయ్‌. రెండు ఈ భాయ్…” అంటూ ఆయ‌న డైలాగ్ చెబుతుంటే పాత నాగార్జున గుర్తుకొచ్చాడు. ఈ ఫీల్డ్‌లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నేనేరా… అని డైలాగ్ చెప్పడం చూసి అభిమానులు పండ‌గ చేసుకొంటున్నారు.

నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘భాయ్‌’. రిచా గంగోపాధ్యాయ క‌థానాయిక‌. వీరభ‌ద్రమ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్‌ని శుక్రవారం రాత్రి యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు. అందులో నాగార్జున స్టైల్ అదిరిపోయింది. కొన్ని స‌న్నివేశాల్లో క్లాస్‌గా, మ‌రి కొన్ని స‌న్నివేశాల్లో మాస్‌గా క‌నిపిస్తూ అభిమానుల‌ను మురిపిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల్ని సెప్టెంబ‌రు1న విడుద‌ల చేస్తారు. అదే నెల‌లోనే చిత్రాన్ని ప్రేక్షల‌కు ముందుకు తీసుకొస్తారు.