చిన్నప్పటి నుంచే జగన్ చేతివాటం..?

Jagan in 10th class Papers Leakage case

Jagan in 10th class Papers Leakage case

రాజకీయనాయకులు సామాన్యులు కారు. నెలలు తరబడి సీబీఐ సైతం తెలుసుకోలేని ఎన్నో విషయాలను పొలిటీషియన్ అలవోకగా చెప్పేస్తారు. ప్రతి నాయకుడి పుట్టుపూర్వోత్తరాలపై వారి దగ్గరుండే ఇన్ఫర్మేషన్ అంతా ఇంతా కాదు. తాజాగా జగన్ చిన్నతనంలో ఎలా ఉండేవాడన్న దానిపై వస్తున్న సమాచారం విస్తుపర్చేలా ఉంది. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి.. వేలాది కోట్ల రూపాయిలు దండుకున్నాడన్న ఆరోపణలపై వివిధ కేసులు మెడకు చుట్టుకోవటం తెలిసిందే. ఆ కేసుల్లో భాగంగా ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే.. ఈ దొంగ బుద్ధి చిన్నతనం నుంచే జగన్ సొంతమట.

జగన్ దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్.. నేరాలకు పేటెంట్ అని చెబుతున్నారు. జగన్ బాబు.. వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్  రెడ్డిలు చిన్నప్పుడే హిమాయత్ నగర్ లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసి అమ్ముకునేవారట. 1986, 87 సంవత్సరాల్లో వీరిద్దరూ కలిసి మేడ్చల్ లోని శివశివాని పబ్లిక్ స్కూల్ లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ దొంగలించి పోలీసులకు దొరికిపోయిన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ‘‘నాడు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోలేదా? క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసేందుకు మారుతి కారుని ఉపయోగించారు. ఆ కారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఉన్నది వాస్తవం కాదా? జగన్, శ్రీకాంత్ రెడ్డిల పుణ్యమా అని పదిమంది విద్యార్థులు పోలీసులు కేసులు ఎదుర్కొని.. తర్వాత ఏ ఉద్యోగం రాక తీవ్రంగా ఇబ్బందులు పడలేదా?’’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.

వేల కోట్ల రూపాయిల దోపిడీకి ముందే.. సూపర్ ట్రాక్ రికార్డు జగన్ బాబు సొంతమన్న మాట అంటూ టీడీపీ లీడర్లు ప్రశ్నిస్తూ.. విమర్శలు చేస్తుంటే.. ఏం మాట్లాడాలో అర్థం కాక చేష్టలుడిగిపోవటం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వంతవుతోంది. తమ జగన్ బాబు మీద వస్తున్న ఆరోపణలకు ధీటుగా.. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు మీద ఏదోలా ఆరోపణలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారట. పాపం.. అందరూ జగన్ లా ఉంటారన్న భ్రమ నుంచి జగన్ జట్టీ ఎప్పుడు బయటపడుతుందో ఏమో…?

Comments are closed.