నా సినిమా విడుదలకు దారేది? – పవన్ కళ్యాణ్

Pawan kalyan Attaritniki daredi To be Released on 20th

Pawan kalyan Attaritniki daredi To be Released on 20th

నా సినిమా విడుదలకు దారేది? అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా… ఓ పక్క క్రేజీ కాంబినేషన్, మరో పక్క వ్యాపారం కూడా బాగా జరిగిపోయింది, ఇక విడుదలైతే సంచలనాలే అనుకుంటున్న దశలో అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం సినిమాని ఎలాగైనా విడుదల చేయాలని చిత్ర బృందం చూస్తోంది. ఇటీవలే `తుఫాన్` విడుదలైంది. ఊహించినంతగా అడ్డంకులేమీ ఎదురు కాలేదు. అందుకే ఇక ఈ గ్యాప్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఉత్తమం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విషయంపై చిత్ర బృందంతో కూడా సమావేశామయ్యారట. అయితే అందులో ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది తేలలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మేలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

ఎందుకంటే వచ్చే నెల 10న `ఎవడు` సినిమాని విడుదల చేయబోతున్నాం అని రామ్ చరణ్ ఇదివరకే ప్రకటించాడు. దీంతో ఎలాగైనా ఈ గ్యాప్ ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే సీమాంధ్రలో బంద్ వల్ల ఉదయం థియేటర్ లలో షో లు వేయడం లేదు. కేవలం సాయంత్రం మాత్రమె ప్రదర్శన జరుగుతోంది. మరి ఈ పరిస్థితుల్లో సినిమా విడుదలైతే వసూళ్ళకు గండిపడే ప్రమాదం ఉంది అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Comments are closed.