ఇద్దరూ క‌లిసి నిర్మిస్తార‌ట‌!

Pawan-kalyan-and-Trivikram-turns-Partners

Pawan-kalyan-and-Trivikram-turns-Partners

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ను చేసే ప్రతీ సినిమా గురించీ త్రివిక్రమ్‌తో చ‌ర్చిస్తారు. అవ‌స‌ర‌మ‌నుకొంటే ఆయ‌న స‌హాయం తీసుకొంటారు. జ‌ల్సా చిత్రం నుంచి వీరిద్దరి మ‌ధ్య స్నేహ‌బంధం కొన‌సాగుతోంది. అత్తారింటికి దారేది చిత్రంతో ఆ బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది.

ఇప్పుడు ఇద్దరూ క‌లిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు స‌మాచారం. ప్రత్యేకంగా ఓ సంస్థను స్థాపించి యువత‌రం ప్రతిభ‌ను  ప్రోత్సహిస్తూ చిన్న సినిమాల‌ను తీయ‌బోతున్నార‌ట‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో ఆఫీసు గురించి అన్వేష‌ణ జ‌రుపుతున్నట్టు స‌మాచారం. త్వర‌లోనే వీరి నిర్మాణంలో ఓ చిన్న సినిమా మొద‌లుకాబోతున్నట్టు తెలుస్తోంది.

Comments are closed.