జగన్ ను డామినేట్ చేసిన పవన్.. !

pavan-kalyan-dominates-jagan/

pavan-kalyan-dominates-jagan

రాష్ట్రంలో నిన్న ’షాకింగ్.. బ్రేకింగ్’ న్యూస్ గా వచ్చిన రెండు వార్తలు ప్రజలను విస్మయానికి గురిచేశాయి. అందులో ఒకటి అందిరిని షాక్ కు గురిచేస్తూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నంటించిన లెటెస్ట్ మూవీ ’అత్తారింటికి దారేది’ రిలీజ్ కు ముందే యూట్యూబ్, ఇంటర్ నెట్ లో హల్ చల్ చేయడం. రెండోది.. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడం. ఈ రెండు వార్తలు కూడా నిన్న హాట్ టాపిక్ గా హల్ చల్ చేశాయి. అయితే, పవన్ మూవీ రిలీజ్ కు ముందే పైరసీగా బయటకు రావడం.. యావత్ చిత్రసీమను షాక్ కు గురిచేసింది. దీనిపై పలువురు ప్రముఖులు సైతం గట్టిగా స్పందించారు. ’అత్తారింటికి.. ’ పైరసీ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో వెబ్ సైట్ల ర్యాకింగ్ ను సైతం ప్రభావితం చేసే రేంజ్ లో పాకిపోయింది. ’అత్తారింటికి..’ షాకింగ్ న్యూస్ అందించడంలో ’తెలుగు మిర్చి డాట్ కామ్’ ప్రధమ స్థానంలో నిలిచింది. పవన్ సినిమా ’పైరసీ’ షాకింగ్ న్యూస్ నుంచి ప్రజలు తేరుకునేలోపు.. మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదే జగన్ కు బెయిల్. పవన్ సినిమా న్యూస్ నడుస్తున్న టైమ్ లోనే జగన్ బెయిల్ బ్రేకింగ్ న్యూస్ వచ్చినా.. ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. నిన్న ఎక్కడా చూసినా.. పవన్ మానియానే కనిపించింది. ఒక్కమాటలే చెప్పాలంటే.. జగన్ ను పవన్ డామినేట్ చేసాడనే చెప్పాలి.

రాజకీయాల్లోకి రాకముందే పవన్ కు ఇంత ఫాలోయింగ్ వుంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవలే అన్నట్టుగా నిజంగానే పవన్ పాలిటిక్స్ లో అరంగేట్రం చేసి జగన్ లా పార్టీ పెడితే పరిస్థితి ఇంకే రేంజ్ లో వుంటుందో.. ! జనం గుండెల్లో వున్నాడంటూ చెప్పుకునే జగన్.. పవన్ సినిమా పైరసీ ఇష్యూకే తట్టుకోలేదు.. ఇక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ వస్తే.. ప్రభంజనమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా పైరసీ పై పవన్ స్పందించక ముందే.. ఆయన అభిమానులు గల్లీ-గల్లీ తిరిగి పైరసీకి పాల్పడిన వారి అంతు చూసేంత పని చేశారు. ఒకవేళ ఆ.. ఆరడుగుల బుల్లేట్ కనుసైగ చేసి వుంటే.. పైరసీ బూతాన్ని క్షణాల్లో కనుమరుగు చేసేవాళ్లేమో.. పవన్ స్టార్ అభిమాన గణం. ఏదేమైనా.. ’పవనిజం’ ముందు ఎవ్వరూ నిలబడలేరని… అది రాజకీయ నాయకుడా..ఇంకేవరైనా..అనేది మరోసారి నిరూపితమైంది.

Comments are closed.