దీపికా పదుకొణె రెండు రోజుకు.. మూడు కోట్లా?

Deepika-Padukone-Demands-Rs-3cr-for-Two-Days

Deepika-Padukone-Demands-Rs-3cr-for-Two-Days

కథానాయికలు పారితోషికం భారీగా డిమాండ్ చేస్తారని తెలుసు. ఒక్కో సినిమాకి కోట్లు తీసుకుంటారనీ తెలుసు. అయితే కేవలం రెండు రోజులకు…  మూడు కోట్లు తీసుకుంటారని ఎవరికైనా తెలుసా? ఇది నిజం. దీపికా పదుకొణె `కొచ్చాడయాన్` సినిమాకోసం రూ 3 కోట్లు పారితోషికం తీసుకుందట. అయితే ఆమెపై సన్నివేశాలు మాత్రం కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేశారట. మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తీసిన సినిమా కావడంతో సన్నివేశాలన్నీ ఇండోర్ లోనే చకా చకా తీసేశారట. రెండు రోజులకే పూర్తిచేసి అమ్మడిని ఇంటికి పంపించేశారట. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించినందుకు గానూ ముందస్తు నిర్ణయం ప్రకారం అక్షరాలా 3 కోట్లు చెల్లించారు.

దీపికకి బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మాట వాస్తవమే అయితే కేవలం రెండు రోజుల్లో మూడు కోట్లు సంపాదిన్చెంత క్రేజ్ రావడం మాత్రం నిజంగా గొప్పతనం. అమ్మడు కనీసం `కొచ్చాడయాన్` ప్రచార కార్యక్రమాల్లో అయినా పాల్గొంతుందో లేదో చూడాలి. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయాలని చూస్తోంది. దర్శకులు ఎవరైనా కథ చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నానని కబురు పంపుతోందట. అయితే అమ్మడి లెక్కలను చూసి నిర్మాతలే ధైర్యం చేయడం లేదట.

Comments are closed.